హైదరాబాద్, పంజాగుట్ట: నవగ్రహాల తల్లిదండ్రులెవరూ... వారి తల్లిదండ్రులెవరూ.. వారి చరిత్ర ఏమిటీ... తదితర అంశాల తో ఇప్పటికే తెలుగులో నవగ్రహ పురాణం పుస్తకం రాగా దానిని ఆంగ్లంలో నవగ్రహ పురాణ పేరుతో తర్జమ చేశా రు. ఈ పుస్తకాన్ని నవంబర్‌ మొదటి వారంలో నగరంలో ఆవిష్కరించనున్నారు. ప్రముఖ తెలుగు రచయిత వక్కంతం సూర్యనారాయణరావు (వీఎస్‌ రావు) సుమారు తొమ్మిది సంవత్సరాల పాటు ప్రాచీన గ్రంథాలను అధ్యయ నం చేసి నవగ్రహాలపై నెల రోజుల పాటు పుస్తకాన్ని రాశా రు. 2010లో ఆంధ్రజ్యోతి నవ్య వార పత్రికలో 45 వారాల పాటు సీరియల్‌గా ప్రచురింపబడింది. 2011లో పుస్తక రూపంలో అందుబాటులోకొచ్చింది. ఇప్పటివరకు తెలుగులో లక్షకు పైగా కాపీలు అమ్ముడు పోయాయి. శుక్రవారం సోమాజిగూడలోని ఎన్‌కేఎం గ్రాండ్‌ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పుస్తక రచయిత వీఎస్‌ రావు, జైకో పబ్లిషింగ్‌ హౌస్‌ ఎండీ సంధ్యా అయ్యర్‌, పుస్తకాన్ని ఇంగ్లి్‌ష లో తర్జమ చేసిన రచయిత ప్రీతా కన్నన్‌, లిటరరీ ఏజెంట్‌ దీప్తి పటేల్‌తో కలిసి ఆయన మాట్లాడారు. మొదటి భాగం లో నవగ్రహాల పుట్టుక, రెండో భాగంలో నవగ్రహాల జీవితం, మూడో భాగంలో నవగ్రహాల మహిమలను వివరించినట్టు వీఎ్‌సరావు తెలిపారు. ప్రాంతీయ భాషల్లో విలువైన గ్రంథాలు ఉన్నాయని వాటిని ఇంగ్లి్‌షలోకి అనువదిం చి ప్రజలకు అందజేయడమే తమ లక్ష్యమని సంధ్యా అయ్యర్‌ అన్నారు. ఇంగ్లిషులో అనువదించిన నవగ్రహ పుస్తకావిష్కరణ కార్యక్రమం నవంబర్‌ మొదటి వారంలో నగరంలో ఉంటుందన్నారు. 

 

నవగ్రహ పురాణాన్ని తెలుగులో చదువుకోండి...