దాదాపు నాలుగేళ్ళ తరువాత డెల్ఫీన్ని గిల్రాయ్స్టార్బక్స్లో చూసాను. నన్ను చూడగానే గుర్తుపట్టింది. నేనుచెయ్యూపి మాట్లాడుదాం అనుకుంటూండగానే, పనుంది వెళ్ళాలి అనేసి పరిగెత్తింది.తను ప్రస్తుతం మార్గన్హిల్లో ఉంటున్నానని మాత్రంచెప్పింది. ఈ హడావిడిలోఫోన్ నంబర్తీసుకోవడంమర్చిపోయాను.
డెల్ఫీన్ నా టెన్నిస్ భాగస్వామి. ఇద్దరం క్యుపర్టినో టెన్నిస్ క్లబ్బులో మిక్సెడ్ డబుల్స్ ఆడేవాళ్ళం. ఒక టెన్నిస్ టోర్నమెంట్ గెలిచాం కూడా. డెల్ఫీన్ చాలా విచిత్రమైన వ్యక్తి. ఉన్నదున్నట్లు మాట్లాడేది. పైపెచ్చు కాస్త కోపం కూడా ఎక్కువ. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో చెప్పడం కష్టం.మా క్లబ్బు నిండా అమెరికన్లూ, చైనీసూ ఎక్కువ. ఇండియన్ని నేనొక్కణ్ణే. డెల్ఫీన్ని ఈ క్లబ్బుకి పరిచయం చేసిందే నేను. ఎక్కువగా మిగతా ఆడవాళ్ళతోనే ఆడేది. ఎందుకో అమెరికన్లతో పడేదికాదు. డెల్ఫీన్ నల్లజాతికి చెందిన వ్యక్తి. వయసు ముఫ్ఫై అయిదు నలభై మధ్యన ఉండచ్చు.టెన్నిస్ బాగానే ఆడేది కానీ బంతిని బలంగా కొట్టాలన్న ధోరణిలో తప్పులు ఎక్కువగా చేసేది.దానికితోడు మా క్లబ్బులో ఆడవాళ్ళకి డెల్ఫీన్తో ఆడటం కష్టంగానే ఉండేది.
ముఖ్యంగా వేగంగా కొట్టే బంతుల్ని ఎదుర్కోవడం.దాంతో డెల్ఫీన్ని ఎలాగయినా ఓడించాలన్న తపన మిగతా ఆడవాళ్ళలో ఉండేది.‘‘హ్యాపీ! నీకు వీళ్ళ సంగతి తెలీదు. అన్నీ దొంగ లైన్ కాల్స్ చేస్తారు. ఒక్కోసారి ఆడాలంటేనే చికాకు. అంతే కాదు, నేను ఏదయినా బాల్ మిస్ అయినా వాళ్ళ కళ్ళల్లో ఆనందమే వేరు!’’ అంటూ నా దగ్గర వాపోయేది. అవేమి పట్టించుకోవద్దని, ఆడటం ముఖ్యం, కోర్టులో జరిగినవి అక్కడే వదిలేయాలని చెప్పేవాణ్ణి. ఇలా పలుకారణాల వలన నాతోనే ఆడటానికి ఇష్టపడేది. ఒక్కోసారి ప్రాక్టీసు కూడా చేసేవాళ్ళం. కలిసినప్పుడల్లా ఒక్కో వివక్ష సంఘటన చెప్పేది. నేను డెల్ఫీన్తో ఆడుతూంటే మిగతా వాళ్ళూ అదోలా చూసేవారు. నేను పట్టించుకునేవాణ్ణి కాను.అసలు నాకు డెల్ఫీన్తో పరిచయం కూడా విచిత్రంగా జరిగింది. ఆరేళ్ళ పైమాట.
శాంతాక్లారా యూనివర్శిటీలో టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతోంది. నేను చూడ్డానికని వెళ్ళాను. ఏదో క్లబ్బు ఆటే తప్ప మరీ అంత ప్రావీణ్యం లేదు నాకు. డెల్ఫీన్ టోర్నమెంటులో మిక్సెడ్ డబుల్స్ ఆడటానికి వచ్చింది. తనతో కలిసి ఆడాల్సిన అతనికి ప్రాక్టీసులో కాలికి గాయం అయ్యింది, ఆడలేనని చివరి నిమిషంలో చెప్పాడట. తనతో ఆడటానికి ఎవరైనా ఉన్నారేమోనని అక్కడ అడుగుతోంది. నాకు తెలుసున్న ఒకతనితో ప్రాక్టీసు నుండి బయటికి వస్తూండగా అడిగింది - ‘నా పార్ట్నర్ రాలేదు. మీలో ఎవరైనా ఆడతారా ్ఞ్ఞ్ఞఅని’.