‘అందరూ నేనే హత్య చేసేనని నమ్ముతున్నారు. నన్ను దోషిగా కూడా ప్రకటించేశారు. కానీ నేను నేరస్తుడిని కాదు. నేను నిరపరాధిని. నేను ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు ఆమె సజీవంగా ఉంది. నన్ను ఎవ్వరూ నమ్మటం లేదు. మీరే నా చివరి ఆశ. నేను నా భార్యను హత్య చేయలేదు. నేను నిరపరాధినని నిరూపించి, అసలు నేరస్తుడిని పట్టుకోవాలి. దాదాపుగా అరుస్తూ, ఏడుస్తూ చెప్తున్న విశ్వనాథ్ వైపు పరిశీలనగా చూస్తూ విన్నాడు డిటెక్టివ్ శరత్.
అతని ఏడుపు ఉధృతం. ఆవేశ ఉధృతి తగ్గిన తరువాత అడిగాడు మృదువుగా.‘ఆ రోజు ఏం జరిగిందో, జరిగింది జరిగినట్టు చెప్పండి’ అడిగాడు శరత్.‘నేను, సరోజ ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. స్నేహితుల సహా యంతో పెళ్ళి చేసుకున్నాం. ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. స్నేహితుల సహాయంతో పెళ్ళి చేసుకున్నాం. హైదరాబాదు వచ్చాం. అతికష్టం మీద నాకు ఉద్యోగం దొరికింది. సరోజకు సులభంగా దొరికింది ఉద్యోగం. తను ప్రొద్దున్న ఏడింటికి వెళ్తే రాత్రి పదింటికి ఇంటికి వచ్చేది. నాది ఊళ్ళు తిరిగే ఉద్యోగం. నెలకి మూడు వారాలు టూర్లలోనే ఉంటాం. మా మధ్య ఎలాంటిగొడవలు లేవు. వాదోపవాదాలు లేవు. ఉన్నంతలో సంతోషంగా, హాయిగా ఉంటు న్నాం. ఇంతలో నాకు ఒక భయంకరమైన సత్యం తెలిసింది’ చెప్పటం ఆపి కళ్ళు తుడుచు కున్నాడు విశ్వనాథ్.మళ్ళీ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు.
గొంతు పెగలటం లేదు. చివరికి అతికష్టం మీద చెప్పటం ప్రారంభించాడు.‘ఆ రోజు నేను టూర్ నుంచి వచ్చేటప్పటికి తను ఆఫీసుకు వెళ్ళిపోయింది. నేను ఏం తోచక కంప్యూటర్ ‘ఆన్’చేశాను. ఆమె ఫేస్బుక్, మెయిల్ ‘లాగ్ ఔట్’ అవటం మరిచి పోయి నట్టుంది. నేను కంప్యూటర్ ‘ఆన్’ చేయగానే అవి ఓపెన్ అయ్యాయి. నేను వద్దనుకుంటూనే ఏవో మెసేజెస్ ఉండటంతో చాటింగ్ ఓపెన్‌చేశాను. ఎవరో ‘రఘువరన్’ అనే వాడితో భయంకరమైన రీతిలో చాటింగ్ చేస్తోంది. అది చూస్తుంటే వాళ్ళు ఎంతసన్నిహితులో అర్థమయింది. వాళ్ల చాటింగ్‌ను బట్టి వాళ్లు కొలీగులనీ అర్థమయింది. నా ప్రపంచం కూలి పోయింది. ఏం చేయాలో నాకు తెలియలేదు. రాగానే అడిగేయాలనుకున్నాను. కానీ ఏమని అడుగుతాను? అందుకే ముభావంగా ఉన్నాను. రాత్రి వచ్చింది. నేను ఎలా ఉన్నానో కూడా గమనించలేదు. నేను తెల్లారే వెళ్ళిపోతాను ఊరికి అని చెప్పాను.