‘‘ఎలా జరిగింది?’’ అడిగాడు డిటెక్టివ్ శరత్.‘‘బార్కి వచ్చాడు తాగలేదు. శరీరంలో ఆల్కహాల్ ఛాయలు లేవు. బహుశా బయటకు వెళ్ళే టప్పుడు పార్కింగ్ప్లేస్లో వెనుకనుంచి ఎవరో దాడిచేసి ఉంటారు. తలమీద బలమైన గాయం తగిలింది. క్రింద పడేప్పుడు ముఖం నేలకు బలంగా తగిలి మరణించాడు’’ చెప్పాడు ఇన్స్పెక్టర్ విజయ్.
మృతుడు మోజెస్ శరత్ స్నేహితుడు. ప్రైవేట్ డిటెక్టివ్. అందుకే శరత్ని పిలిచాడు విజయ్.‘ఇప్పుడు ఏ కేసు డీల్ చేస్తున్నాడో’ అడిగాడు శరత్.‘అదే పరిశోధిస్తున్నాను. ఇక నువ్వే ఈ కేసు టేకప్చెయ్’’ అన్నాడు విజయ్.అంతలో శరత్ అసిస్టెంట్ రాము వచ్చాడు.‘‘బాస్, మోజెస్ వివాహితుడు. కానీ ఇద్దరూ వేరుపడ్డారు. ఆమెకి వార్త ఇప్పుడే తెలిసింది. మోజెస్ ప్రస్తుతం రెండు మూడు కేసులు పరిశోధిస్తున్నాడు. శత్రువులు తనపై దాడి చేస్తారని ఓ రాజకీయనాకుడి అనుమానం. అతడి శత్రువుల పథకాలను పసికట్టే ప్రయత్నం చేస్తున్నాడు మోజెస్. మరోకేసు భార్యకు భర్తమీద అనుమానం. అది కూడా డీల్ చేస్తున్నాడు.
మూడవ కేసు ఒక రౌడీషీటర్ హత్య. పోలీసులు పట్టించు కోవటం లేదని అతని భార్య మోజెస్ని కలిసింది. ఈ మూడు కేసులు పరిశోధిస్తున్నాడు. మోజెస్ తన భార్యతో గొడవపడినప్పటినుంచి అతడికి పనిపై శ్రద్ధ తగ్గిందంటున్నారు. కొత్తకేసులు తీసుకోవటం లేదట’’ చెప్పాడు రాము.‘‘గుడ్..ఆ కేసులకు సంబంధించిన అతడి పరిశోధన నోట్స్ సంపాదించావా?’’‘‘తెచ్చాను బాస్’’ చెప్పాడు రాము.‘‘సరే విజయ్. ఈ కేసు నేను టేకప్ చేస్తాను. ఓసారి హత్య జరిగిన స్థలం చూస్తాను’ అన్నాడు శరత్.