అల వచ్చి విసురుగా కొడుతూంటే, పైపైకి లేచి పడుతోందది పొదల్లో చిక్కుకుని. ఎక్కడ్నుంచి కొట్టుకొచ్చిందో, ఎప్పట్నించీ వుందో బాగా ఉబ్బిపోయి వుంది. మెడకి ఉచ్చు బిగించి చెట్టుకి వేలాడదీసినా, కాళ్ళు కట్టేసి నీట్లోకి తోసేసినా జరిగేదొక్కటే - తప్పించుకోలేని చావు. కట్టేసిన కాళ్ళు కనపడుతున్నాయి. ఆ కాళ్ళకి పట్టీలు అలాగే వున్నాయి. ఈతగాళ్ళు ఒడ్డుకి చేర్చారు. ఛాతీకి రెండు రంధ్రాలున్నాయి. గుళ్ళు పేల్చడం వల్ల అవి ఏర్పడ్డాయి.
అసోంలోని తేల్పానీ నదిలో కొట్టుకొచ్చిన ఆమె శవం ఓ ప్రశ్నలా నిల్చింది ఇన్స్పెక్టర్ అర్జిత్కి. పోస్ట్‌మార్టంలో రెండు బుల్లెట్లు బయటపడ్డాయి. అవి 9 ఎంఎం రివాల్వర్ బుల్లెట్లు. మృతురాలి వయసు ముప్పై రెండుంటుంది. పేరు తెలీదు, ఊరు తెలీదు. ఏ వాహనంలోనో చంపి తీసికెళ్ళి శవాన్ని నదిలో పడేసి వుంటారని అనుమానించారు. డీఎస్పీ రెండు టీములు ఏర్పాటు చేశాడు. మూడ్రోజులు కష్టపడితే మూలాలు తెలిశాయి... డింపీ అనే డైవోర్సీ ఫ్రమ్ దిబ్రూఘర్! ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఇన్స్పెక్టర్ అర్జిత్ కేసు టేకప్ చేశాడు. డైవోర్సీకి ఎవరితో చెడి బుల్లెట్లు బలిగొన్నట్టు? ఆమెకు తల్లిదండ్రులున్నారు. మూడేళ్ళ కూతురుంది. విడాకుల సెటిల్మెంట్లో కూతురికి 32 లక్షలివ్వాలని మొగుడిని ఆదేశించింది కోర్టు. అందులో ఏడు లక్షలు ఒకసారి అందాయి.
ఇంకో తొమ్మిది లక్షలు అందిన రాత్రే హత్యకి గురయ్యింది.‘అల్లుడేనా ఈ పని చేసింది?’, పోలీసుల ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం దొరికింది.‘అతను మంచోడు. దివ్యజ్యోతితో కలిసి మా అమ్మాయి వుంటోంది ఆర్నెల్లుగా వేరే వూళ్ళో’ అన్న సమాధానానికి పోలీసులకి కొత్త ట్విస్ట్ దొరికింది.‘దివ్యజ్యోతి ఎవరు?’‘ఇండియన్ ఆయిల్లో పనిచేస్తాడు, మా అమ్మాయి కంటే రెండేళ్ళు చిన్నోడు’ అని సమాధానం ఇచ్చారు వాళ్లు.దివ్యజ్యోతి కోసం మళ్ళీ రెండు టీములు రంగంలో దిగాయి. దివ్యజ్యోతి పరారీలో వున్నాడు. పోలీసులు తమ పద్ధతుల్లో జాడతీసి పట్టేసుకున్నారు. చంపింది తను కాదంటూ గోలగోల చేశాడతను.‘నీ స్కార్పియో ఏదీ?’,‘ఎటాక్ జరిగితే వదిలి పారిపోయా!’,‘ఎలా?’ - రెట్టించాడు పోలీసు అధికారి అర్జిత్.కారులో తనూ డింపీ పోతూంటే ఎవరో కాల్పులు జరిపారనీ, మూడు సార్లు కాల్చారనీ, రెండు బుల్లెట్లు వచ్చి డింపీకి తగిలాయనీ, తను కార్లోంచి దూకి పారిపోయాననీ వివరించాడు.
కారు కోసం గాలింపు చేపట్టాడు అర్జిత్. శవం దొరికిన చోటు నుంచి నదికి ఎగువన ముప్పై కిలోమీటర్ల దూరంలో... తుప్పల్లో వుంది స్కార్పియో. దాని అద్దానికి మూడు బుల్లెట్ రంధ్రాలున్నాయి. మూడు రంధ్రాలుంటే, మరి మూడో బుల్లెట్ ఏది? మూడో బుల్లెట్ కారులో దొరకలేదు. టీం ఒక నిర్ధారణకొచ్చింది. నిందితుడు చెప్తున్నట్టు, స్పీడుగా పోతున్న కారులో టార్గెట్‌ని బయటి నుంచి షూట్ చేయడం అసాధ్యం. అదీ రాత్రిపూట. బుల్లెట్ రంధ్రాలు ఆమె కూర్చున్న వైపు... కారు ఎడం పక్క అద్దానికున్నాయి. కానీ ఆమె ఛాతీకి బుల్లెట్లు కుడి పక్కనుంచి తగిలాయి. అప్పుడు, కుడి పక్క అద్దానికి రంధ్రాలు పడాలి. పడలేదంటే ఎడం పక్క నుంచి కూడా బుల్లెట్లు రాలేదు. షూటింగ్ కారులోపలే జరిగి వుండాలి. అదీ డ్రైవింగ్ సీట్లో వున్న వ్యక్తి, పక్కన కూర్చున్న ఆమెని కాల్చి వుండాలి. అనుమానం లేదు. క్లోజ్ రేంజిలో పేల్చిన బుల్లెట్లు అవి. అందుకే బుల్లెట్ గాయాల్లో గన్ పౌడర్, గ్యాసెస్ చేరిపోయాయి. ‘మూడు రంధ్రాలెలా పడతాయి అద్దం మీద?’ అన్న అర్జిత్