ఇందులోని కథలన్నింటికీ కేంద్రం కుటుంబమే. మధ్య తరగతి కుటుంబాల్లో సడలిపోతున్న అనుబంధాల నుంచి పుట్టిన ఆవేదనకు ప్రతిరూపమే ఈ కథలు. జీవితం పట్ల అపారమైన ప్రేమ, జీవితాన్ని అసంగతంగా మారుస్తున్న వ్యామోహాలపట్ల అసహనం కనబరిచిన 19 కథల సమాహారమీ సంపుటి. 


-లలితా త్రిపుర సుందరి

వేకువపాట
కథా సంపుటి 
వారణాసి నాగలక్ష్మి 
ధర: 150 రూపాయలు 
పేజీలు: 248 
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు